‘డ్యూ డేట్’తో కొత్త సినిమా ప్రారంభం

‘డ్యూ డేట్’తో కొత్త సినిమా ప్రారంభం

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓ, జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న తాజా సినిమా ‘డ్యూ డేట్’ ఘనంగా ప్రారంభమైంది. వర్షిష్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆనంద్ కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు. ఈ సినిమాలో లోమేష్ పూడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రణీత పట్నాయక్, విజ్ఞాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్ ఇవ్వగా, నిర్మాత బన్నీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు విజయ్ కనకమేడల, వి.ఐ. ఆనంద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుత సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా ఈ కథను రూపొందించినట్లు నిర్మాతలు వెల్లడించారు. టైటిల్ నుంచి కథ వరకు ప్రతి అంశం కొత్త అనుభూతిని అందిస్తుందని, ఉత్కంఠభరితమైన కోర్ట్‌రూమ్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, చెంచు జింక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Related Articles