హీరో విశ్వక్‌సేన్ యాక్ట్ చేస్తున్న సినిమా ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి వెండితెరపైకి ఎక్కిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌లో విశ్వక్‌సేన్ అమ్మాయి పాత్రలో దర్శనమివ్వనున్నారు. సంక్రాంతి సందర్భంగా విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లోని కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన అచ్చు అమ్మాయిలా కనిపిస్తున్నారు. లేడీ గెటప్‌లోని సన్నివేశాలు చక్కటి హాస్యాన్ని పండిస్తాయని చిత్ర బృందం చెబుతోంది. లైలా పాత్రలో విశ్వక్‌సేన్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందని, ఆయన కెరీర్‌లో ఇదొక వైవిధ్యభరితమైన సినిమా అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న రిలీజ్ చేస్తారు. ఈ సినిమాకి సంగీతం: లియోన్ జేమ్స్.
- January 16, 2025
0
258
Less than a minute
Tags:
You can share this post!
administrator

