తెలుగు సినిమా కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బ్రహ్మ ఆనందం’. మసూద లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆర్‌వీఎస్ నిఖిల్ డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా.. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా నుండి టీజర్‌ను షేర్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే.. రాజా గౌతమ్, బ్రహ్మానందం తాత మనవడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దరిద్రంను పర్స్‌లో పెట్టుకుని తిరుగుతున్న రాజా గౌతమ్‌కి అతడి లైఫ్‌లోకి తాత వచ్చిన తర్వాత జరిగిన కథేంటి అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.

- January 16, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor