‘జాబిలమ్మ నీకు అంత కోపమా’..ధనుష్‌

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’..ధనుష్‌

తమిళ హీరోగా ధనుష్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మరోవైపు దర్శకుడిగా కూడా ఆయన చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన పాండి, రాయన్‌ సినిమాలు భారీ విజయాల్ని సాధించాయి. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమాని  ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. రొమాంటిక్‌ కామెడీ టైప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలకానుంది. పవీష్‌, అనిఖ సురేంద్రన్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, మాథ్యూ థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఏషియన్‌ సురేష్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ మ్యూజిక్‌ను అందించారు.

editor

Related Articles