హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘దిల్ రూబా’. విశ్వకరుణ్ దర్శకుడు. శివమ్ సెల్యూలాయిడ్స్, సారెగమ మ్యూజిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ‘అగ్గిపుల్లె..’ అనే తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. సామ్ సీఎస్ ఈ గీతానికి స్వరాల్ని అందించారు. లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని, ‘క’ తర్వాత కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: సామ్ సీఎస్, ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్.

- January 20, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor