విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా పేరేమిటో..?

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా పేరేమిటో..?

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా వస్తుండగా విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మూడు బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి నిర్మాత నాగ‌వంశీ నేడు ఒక పోస్ట్ పెట్టాడు. వీడీ 12 టైటిల్‌ త్వరలోనే వెల్లడిస్తామని నాగవంశీ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు సామ్రాజ్యం అనే టైటిల్ ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. తన సామ్రాజ్యం కోసం విజయ్ ఏం చేశాడు..? అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పోలీస్‌ పాత్రతో పాటు ఖైదీగా విజ‌య్‌ నటిస్తున్నాడని ఒక రూమర్ ఉంది, ఎంతవరకు నిజమో.

editor

Related Articles