కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి వీరధీరసూరన్. విక్రమ్ 62 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ హీరో నటిస్తున్న సినిమాల్లో ఒకటి వీరధీరసూరన్. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎక్జయిటింగ్ అప్‌డేట్ అందించబోతున్నారంటూ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రియా ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా విడుదల తేదీయే అయి ఉంటుందని అంతా ఎదురుచూస్తుండగా.. దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది. క్యూట్ క్యూట్‌గా సాగుతున్న రియా సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే లాంచ్ చేసిన వీరధీరసూరన్ టైటిల్ టీజర్ పక్కా యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్‌జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- January 22, 2025
0
26
Less than a minute
Tags:
You can share this post!
editor