మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న సినిమా ఛావా. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నుండి వస్తున్న ప్రాజెక్ట్ చావా. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా నుండి వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌తో పాటు అతడి భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక ఫస్ట్ లుక్‌లను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుండి బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని అతి క్రూరంగా పాలించిన మొఘల్ షాహెన్‌షా ఔరంగజేబు! అంటూ అతడి పోస్టర్‌ను షేర్ చేసింది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

- January 22, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor