నటుడిపై అత్యాచారం ఆరోపణలు.. పరారీ!

నటుడిపై అత్యాచారం ఆరోపణలు.. పరారీ!

పోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కేఆర్‌ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. గతేడాది కోజికోడ్‌లోని కసాబా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆయనపై కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక దాడి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలను మోపారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు జయచంద్రన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతకు ముందు కోజికోడ్‌ సెషన్స్‌ కోర్టు సైతం బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసు తీవ్రమవడంతో ఆయన పరారయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన గురించి సమాచారం తెలిస్తే కోజికోడ్‌లోని కసబా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

editor

Related Articles