‘గాయపడ్డ సింహం’ చిత్రంలో ధర్మా పాత్రను పోషించిన JD Chakravarthy తన పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కథలో ఉన్న కొత్తదనం, క్యారెక్టర్‌లో ఉన్న ఛాలెంజ్ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈ సినిమాలో ఒకే క్యారెక్టర్ రెండు భిన్న షేడ్స్‌లో కనిపించడం ప్రత్యేకమని, అదే తనకు ఎక్సైట్ కలిగించిందని తెలిపారు. నటుడిగా తాను ఎప్పుడూ కథ నచ్చితేనే సినిమా చేస్తానని, కమర్షియల్ ఫార్ములాల కంటే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు.
దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కథను కొత్తగా, హిలేరియస్ హ్యూమర్‌తో ప్రెజెంట్ చేశారని, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తరుణ్ భాస్కర్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని చెప్పారు. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్న అనుభూతి ఇస్తుందని తెలిపారు.

