మా ఆస్తుల‌ని తాక‌ట్టు పెట్టాం..: ర‌కుల్ భ‌ర్త‌

మా ఆస్తుల‌ని తాక‌ట్టు పెట్టాం..: ర‌కుల్ భ‌ర్త‌

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ముంబైలో అక్క‌డ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ త‌న స్నేహితుడు జాకీ భ‌గ్నానిని వివాహం చేసుకుంది. పెళ్ల‌య్యాక కూడా వీరి రాత మార‌డం లేదు. ర‌కుల్ న‌టిగా మంచి అవ‌కాశాలు అందిపుచ్చుకోలేక‌పోతోంది. అలానే రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ నిర్మాత‌గా రాణించ‌లేక‌పోతున్నారు. ఆయ‌న బాలీవుడ్ అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘బడే మియా ఛోటే మియా’ అనే భారీ బ‌డ్జెట్ సినిమా నిర్మించారు. గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ‌ర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా వైఫ‌ల్యంపై తాజాగా జాకీ స్పందించారు. ఈ సినిమా వ‌ల‌న తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సినిమా కోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని జాకీ స్ప‌ష్టం చేశారు. ఇది నాకు జీవితంలో ముఖ్య‌మైన గుణ‌పాఠం నేర్పింది. ఒక సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తే స‌రిపోద‌ని, సినిమా రిలీజ్ అయ్యాక అర్ధ‌మైంది. మా క‌థ‌తో ప్రేక్ష‌కులు ఎందుకు కనెక్ట్ కాలేక‌పోయార‌నే దానిపై ఒక్క‌సారి విశ్లేషించుకోవాలి. ప్రేక్షకుల నిర్ణయం స‌రైన‌దే కావ‌చ్చు, వారిని త‌ప్పు ప‌ట్ట‌కుండా దీనిని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి అని జాకీ అన్నారు. ఇక ఈ సినిమా క‌లెక్షన్స్ గురించి మాట్లాడిన ఆయ‌న మేము పెట్టిన పెట్టుబ‌డిలో 50 శాతం తక్కువే వ‌సూళ్లు వ‌చ్చాయి. కాగా, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘బడే మియా ఛోటే మియా’ తెరకెక్కగా, ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా వంటి తారలు కీలక పాత్రలు పోషించారు.

editor

Related Articles