ఈ వారం థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న లేటెస్ట్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్‌గా దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కిస్తున్న సినిమా “దిల్ రూబా” ఒకటి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో నిర్మాతలు ప్రీరిలీజ్ ఈవెంట్‌ని కూడా చేశారు. మరి ఈ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్‌గా మారాయి. ప్రెజెంట్ టెన్త్ క్లాస్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న యువతకి తన తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే ఒకవేళ పరీక్షల్లో రాసి లేదా చదివి తలనొప్పి వస్తే తన సినిమా చూడండి ఆ తలనొప్పి తగ్గిపోతుంది అని తాను హామీ ఇస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు చూడడం అవ్వకపోతే పరీక్షలు అయ్యాక అయినా తన సినిమా చూడండి ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తాను అని ఈ హీరో ప్రామిస్ చేస్తున్నాడు. దీంతో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా ఈ మార్చ్ 14న రిలీజ్‌కి కాబోతుంది.

- March 12, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor