టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కలిసి ఒక సినిమాలో నటిస్తుండటంతో పాటు ఇటీవల కార్తీక్ కుటుంబంలో జరిగిన ఒక పార్టీలో శ్రీలీల హాజరవ్వడం ఈ అనుమానలకు దారితీసింది. అయితే తాజాగా కార్తీక్ అమ్మగారు చేసిన వ్యాఖ్యలు వలన వీరిద్దరూ నిజంగానే డేటింగ్‌లో ఉన్నారా అనే డౌట్స్ బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ‘ఐఫా’ డిజిటల్ అవార్డ్స్ (IFFA) వేడుకలో పాల్గొన్న కార్తీక్ ఆర్యన్ అమ్మను నిర్మాత కరణ్ జోహార్ అడుగుతూ.. మీకు ఎలాంటి కోడలు రావాలనుందని అడుగుతాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఒక మంచి డాక్టర్ మా ఇంటికి కోడలిగా రావాలని అనుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించి చేసిందా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోన్న విషయం తెలిసిందే. గుంటూరు కారం షూటింగ్ సమయంలో కూడా సినిమా షూటింగ్‌తో పాటు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యింది శ్రీలీల.

- March 12, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor