‘వార్ 2’ బాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి డేట్ ఫిక్సయింది. ఆయన నటిస్తున్న వార్ 2 సినిమాకు సంబంధించి తాజాగా విడుదల తేదీని ప్రకటించాడు బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జూ. ఎన్‌టిఆర్, హృతిక్ రోషన్ పోటా పోటీగా నటించారని తెలుస్తోంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుడగా.. ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించాడు హృతిక్ రోషన్. వార్ 2 సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.

- April 5, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor