‘కూలీ’ రజినీకాంత్‌ సినిమాకి పోటీగా హృతిక్ రోష‌న్ ‘వార్ 2’

‘కూలీ’ రజినీకాంత్‌ సినిమాకి పోటీగా హృతిక్ రోష‌న్ ‘వార్ 2’

హీరో ర‌జినీకాంత్  ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. రజినీకాంత్ కెరీర్‌లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. హీరోలు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ క‌డుతుండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగస్ట్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాతలు. అయితే ఇదే రోజున బాలీవుడ్ నుండి మ‌రో అగ్ర సినిమా రాబోతోంది. హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్న చిత్రం వార్ 2. ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా ఆగస్ట్ 14నే విడుద‌ల కాబోతుంది.

editor

Related Articles