మోహన్ బాబు, విష్ణు ఒకవైపు మంచు మనోజ్ మరో వైపు. పోలీస్ స్టేషన్ వరకు వీరి గొడవ వెళ్లడం, దానిని మీడియా కవర్ చేయడంతో మంచు ఫ్యామిలీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఆస్తుల విషయంలోనే వారికి గొడవలు జరిగినట్టు అందరు భావించారు. కాకపోతే అసలు నిజం ఏంటన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే తాజాగా మంచు విష్ణు భార్య విరానికా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీవన శైలి.. పిల్లలు.. భర్త విష్ణు గురించి కొన్ని విషయాలు పంచుకోగా, ఆ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదం గురించి విరానికా మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో సమస్యలుంటాయి. మా కుటుంబానికి కూడా దురదృష్టవశాత్తు అలాంటి సమస్యలు రావడం జరిగింది. ఇది మొత్తం కుటుంబంపై ప్రభావాన్ని చూపుతోంది. మేము ఆందోళన పడేది పిల్లల గురించి. ఇలాంటి విషయాలు పిల్లలపై ఎక్కువ ప్రభవాన్ని చూపిస్తాయి. నాకు నా పిల్లలు ముఖ్యం కాబట్టి ఆ ప్రభావం వారిపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది.. అందుకు నేను తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం అని నేను భావించాను.

- March 26, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor