ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ హీరో కెరీర్ గ్రాఫ్ సడన్‌గా పడిపోయింది. ఆపరేషన్ వాలంటైన్, గాండీవ ధారి అర్జున, గని, మట్కా సినిమాలతో వరుస డిజాస్టార్‌లను అందుకున్నాడు. ఇదిలావుంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలను పక్కనపెట్టి కొత్త జానర్‌లో సినిమా చేయబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రితికా నాయక్ కథానాయిక. ఈ సినిమాలో గత సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇండో కొరియన్ హర్రర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి సినిమా యూనిట్ షూట్ బిగిన్స్ అంటూ అనౌన్స్‌మెంట్‌ను షేర్ చేసింది.

- March 26, 2025
0
13
Less than a minute
Tags:
You can share this post!
editor