ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర సినిమా మార్చి 28న (జపాన్ భాష)లో జపాన్ దేశంలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం తన సతీమణితో కలిసి జపాన్‌లో వాలారు జూనియర్ ఎన్టీఆర్. గత రెండు మూడు రోజులుగా అక్కడి వారితో కలిసి తెగ సందడి చేస్తున్నాడు. అయితే ప్రణతి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన వేడుకలకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ అమ్ములు.. హ్యాపీ బర్త్ డే అంటూ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ పోస్ట్‌తో జూనియర్ తన భార్యని ముద్దుగా అమ్ములు అని పిలుచుకుంటాడు అని అర్ధమైంది. గత ఏడాది కూడా ఎన్టీఆర్ తన భార్యకి హ్యాపీ బర్త్ డే అమ్ములు అని విషెస్ చెప్పిన విషయం తెలిసిందే. తారక్ షూటింగ్స్ లేనప్పుడు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకి వెళుతుంటారు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో కలిసి చేస్తున్న సందడికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

- March 26, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor