బాలయ్యతో ఫిక్స్ అయిన కాజల్ అగర్వాల్..!

బాలయ్యతో ఫిక్స్ అయిన కాజల్ అగర్వాల్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో 111వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో బాలయ్య సరసన హీరోయిన్ ఎవరు అనే విషయం ఆసక్తిగా మారింది. మొదట ఈ చిత్రానికి నయనతార పేరు వినిపించినప్పటికీ, తర్వాత కాజల్ అగర్వాల్ పేరు ముందుకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, కాజల్ మొత్తం మే నెలను ఈ సినిమాకు కేటాయించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలయ్య-కాజల్ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనుందా అన్న ఆసక్తి పెరిగింది.

Related Articles