‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి, తాజాగా రామాయణ సినిమాలో సీత పాత్రపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో తాను సీత పాత్రను రిజెక్ట్ చేసిందన్న ప్రచారం నిజం కాదని తెలిపింది. తాను ఆడిషన్‌కు వెళ్లిన విషయం నిజమే కానీ, ఆ పాత్రకు ఎంపిక కాలేదని స్పష్టం చేసింది. ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గౌరవంగా అనిపించిందని, అంత పెద్ద పాత్రకు ఆడిషన్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని చెప్పింది. సౌత్ నుంచి సాయి పల్లవిని ఎంపిక చేయడం తనకు ఆనందంగా అనిపించిందని వెల్లడించింది. కెరీర్ విషయానికి వస్తే, ‘కేజీఎఫ్’ తర్వాత ‘కోబ్రా’, ‘హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీనిధి, ఇకపై తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకుంది.
- May 2, 2026
0
25
Less than a minute
You can share this post!
editor

