విక్రమ్‌ వీరధీరసూరన్‌ Super లుక్‌…

విక్రమ్‌ వీరధీరసూరన్‌ Super లుక్‌…

కోలీవుడ్ స్టార్ విక్రమ్ వరుస సినిమాలతో బిజీ. విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం వీరధీరసూరన్‌. చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ డైరెక్షన్ చేస్తున్నారు. ఛియాన్ 62గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే టైటిల్‌ టీజర్‌ లాంచ్ చేశారు. ఈసారి విక్రమ్‌ పక్కా యాక్షన్‌ సినిమాతో రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోలీవుడ్ భామ దుషారా విజయన్‌ ఫిమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. డీఓపీ తెని ఈశ్వర్‌ ఐఫోన్‌ సహాయంతో ఈ స్టిల్‌ తీశాడు.. తాజా పోస్టర్‌ షేర్ చేశాడు విక్రమ్‌. దుషారా విజయన్‌, విక్రమ్‌ హాఫ్‌ ఫేస్‌ లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా 2025 పొంగల్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా.‌. విక్రమ్‌ టీం దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన చేస్తుందేమో చూడాలి. ఇప్పటికే దుషారా విజయన్‌ లుక్‌ కూడా రిలీజ్ చేయగా.. ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో పాపులర్ యాక్టర్ కమ్‌ డైరెక్టర్ ఎస్‌జే సూర్య, పాపులర్‌ మలయాళ నటుడు సూరజ్‌ వెంజరమూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టూ పార్ట్స్‌గా తీస్తారని తెలుస్తూండగా.. దీనిపై మేకర్స్‌ నుండి ఇంకా క్లారిటీ రాలేదు.

administrator

Related Articles