ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్’. 22 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మాస్ హీరోగా ప్రభాస్‌కి గొప్ప విజయాన్ని చేకూర్చింది. జయంత్ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా తెరపై చూపించారు. నిర్మాత కె.అశోక్‌కుమార్.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్’ సినిమా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని కొత్తగా కట్ చేసి రిలీజ్ చేస్తారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్’ అంటూ వదిలిన ‘ఈశ్వర్’ ట్రైలర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోందని సినిమాని విడుదల చేస్తున్న లక్ష్మీ నరసింహా మూవీస్ వారు హ్యాపీగా చెప్పారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మేం ఇస్తున్న కానుక ‘ఈశ్వర్’ అన్నారు.