బెయిల్‌పై బయటకు వచ్చిన నటుడు బాలా – భార్య, కూతురిపై వ్యాఖ్యానించడం మానేయాలని కోర్టు కండిషన్. మలయాళ నటుడు బాలా అరెస్ట్ అయిన కొన్ని గంటల తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. మాజీ భార్య అమృత సురేష్ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నటుడు బాలాను అక్టోబర్ 14న కడవంత్ర పోలీసులు అరెస్టు చేశారు. బాలా తన మాజీ భార్య, కుమార్తె గురించి మాట్లాడకుండా కోర్టు ఆంక్షలు పెట్టింది.
అక్టోబర్ 14న అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత నటుడు బాలాకు ఎర్నాకులం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతని మాజీ భార్య అమృత సురేష్ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. బాలా తన పరువు తీశాడని, తనతోపాటు తన కూతురు అవంతికను అవమానిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాలా, అతని మేనేజర్ రాజేష్‌లను అక్టోబర్ 14న కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు.