హీరో దళపతి విజయ్ ప్రస్తుతం దళపతి 69 సినిమాతో బిజీగా ఉన్నాడన్నది అందరికీ తెలిసిందే. కార్తీ (ఖాకీ) ఫేం హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జన నాయగన్ (ప్రజల నాయకుడు) టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. విజయ్ ఏప్రిల్ చివరి కల్లా తన పార్ట్‌కు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయనుండగా.. మే లేదా జూన్ కల్లా మొత్తం షూటింగ్ కంప్లీట్ కానున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాని 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా మంచి సమయం చిక్కింది. అంతేకాదు విజయ్ ఈ సినిమా షూట్ పూర్తయిన తర్వాత తన పొలిటికల్ జర్నీపై ఫోకస్ పెట్టనున్నాడని సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

- April 4, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor