అజిత్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగారు. అనేక సూపర్ హిట్ సినిమాలతో తమిళ ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్షకులని సైతం అలరించారు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తుంటారు. ఇటీవలే విదాముయార్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అజిత్ కార్ రేసింగ్, బైక్ రేసింగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడన్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఐఐటీ ( ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) విద్యార్థుల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తక్ష డ్రోన్ ప్రాజెక్టుకు ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు అజిత్ తన కొడుకు ఆద్విక్‌కి కారు రేసింగ్‌లో మెళకువలు నేర్పించడంలో నిమగ్నమయ్యాడు. ఆద్విక్ మంచి టాలెంటెడ్ పర్సన్. ఇటీవల పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత బ్రెజిల్ లెజెండ్స్ జట్టు, ఇండియా ఆల్ స్టార్స్ జట్టు మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ ఆద్విక్ సత్తా చాటి తండ్రికి తగ్గ కొడుకుగా పేరుతెచ్చుకున్నాడు.

- April 4, 2025
0
7
Less than a minute
Tags:
You can share this post!
editor