విజ‌య్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘కింగ్‌డ‌మ్’ కొత్త పోస్ట‌ర్ రిలీజ్

విజ‌య్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘కింగ్‌డ‌మ్’ కొత్త పోస్ట‌ర్ రిలీజ్

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నేడు 36వ బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌డికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 2011లో “నువ్విలా” సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన విజయ్, 2015లో వ‌చ్చిన‌ “ఎవడే సుబ్రమణ్యం” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంత‌రం 2016లో వ‌చ్చిన పెళ్లిచూపులు, 2017లో వ‌చ్చిన అర్జున్ రెడ్డి అత‌డికి స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత “మహానటి” (2018), “గీత గోవిందం” (2018) వంటి కమర్షియల్ స‌క్సెస్‌ల‌ను అందుకున్నాడు. ప్ర‌స్తుతం కింగ్‌డ‌మ్ సినిమాతో విజ‌య్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మే 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నేడు విజ‌య్ బ‌ర్త్‌డే కానుక‌గా.. సినిమా నుండి కొత్త పోస్ట‌ర్‌ని వ‌దిలారు. ఈ పోస్టర్‌లో విజయ్ చాలా రఫ్‌గా, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో పాటు, చిత్రబృందం త్వరలో మరిన్ని అప్‌డేట్‌లను విడుదల చేసే అవకాశం ఉంది.

editor

Related Articles