‘సాహిబా’ పేరుతో హిందీ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో విజయ్‌ దేవరకొండ

‘సాహిబా’ పేరుతో హిందీ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో విజయ్‌ దేవరకొండ

హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘సాహిబా’ పేరుతో హిందీ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించారు. ‘హీరియే..’ గీతంతో పాపులర్‌ అయిన స్వరకర్త, గాయని జస్లీన్‌ రాయల్‌ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం. ఈ గీతంలో విజయ్‌ దేవరకొండకు జోడీగా రాధిక మదన్‌ నటించారు. సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ ఆల్బమ్‌ను విడుదల చేశారు. వింటేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మెలోడీ ప్రధానంగా ప్రేమలోని సున్నిత భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఇందులో విజయ్‌ దేవరకొండ ఫొటోగ్రాఫర్‌గా కనిపించారు. ‘హీరీయే..’ గీతం తరహాలోనే ‘సాహిబా’ సైతం సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని మ్యూజిక్‌ డైరెక్టర్‌ జస్లీన్‌ రాయల్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కేరళలో ఓ షెడ్యూల్‌ జరిగింది. ఈ సినిమాతో పాటు రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో పీరియాడిక్‌ చిత్రంలో నటిస్తున్నారు విజయ్‌ దేవరకొండ.

administrator

Related Articles