శ్రీలీల నవ్వు అందమైంది..

శ్రీలీల నవ్వు అందమైంది..

‘పుష్ప 2’లో ఐటమ్‌ సాంగ్‌కి శ్రీలీల రూ.5 కోట్లు తీసుకుంటోందని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌. ఆమె డ్యాన్సింగ్‌ టాలెంట్‌కి అదేం పెద్ద ఎక్కువ కాదని శ్రీలీల ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ‘ది వైల్డ్‌ చైల్డ్‌’ పేరుతో శ్రీలీల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోషూట్‌ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతోంది. ఇది కేవలం ముఖ హావభావాలకు సంబంధించిన ఫొటోషూట్‌ కావడం విశేషం. ఈ ఫొటోషూట్‌లో శ్రీలీల తన అందమైన కళ్లను, అంతకంటే అందమైన తన నవ్వునూ ఎలివేట్‌ చేస్తూ తెగ సందడి చేసింది. ‘అందంగా నవ్వాలి.. హద్దులు చెరిపేయాలి.. వాలుగా చూడాలి.. కవ్వింతగా కనుసైగ చేయాలి..’ ఇలా కొటేషన్స్‌ పెడుతూ.. దానికి తగ్గట్టు క్లోజ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో శ్రీలీల కనిపించిన తీరుకు అభిమానులు ఫిదా.. ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ఆమె ఐటమ్‌ సాంగ్‌ డ్యాన్స్ ‘పుష్ప 2’లో వచ్చే నెల 5న విడుదల కానుంది.

administrator

Related Articles