కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ తెరకెక్కిస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమా ఈ నెల జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద చాలాకాలంగా విజయ్ సరైన హిట్ లేకపోవడంతో, ఫ్యాన్స్‌కి ‘కింగ్‌డమ్’పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, విజయ్ దేవరకొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన తీవ్ర నీరసంగా ఉన్న కారణంగా హాస్పిటల్‌కి వెళ్లగా డాక్టర్లు డెంగ్యూ అని నిర్ధారించారని తెలుస్తోంది. కనీసం మూడు రోజులపాటు వైద్య పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది కదా మా హీరో డెడికేషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీడియోలో విజయ్ దేవరకొండ ఓ సందులో రెండు కాళ్లని బ్యాలెన్స్ చేసుకుంటూ గోడపైకి అవలీలగా ఎక్కేస్తాడు. విజయ్ దేవరకొండ డెడికేషన్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

- July 18, 2025
0
109
Less than a minute
Tags:
You can share this post!
editor