విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌లోను తెగ సందడి చేస్తూ ఉంటారు. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూ ఉంది. దానికి వారు సరైన క్లారిటీ ఇవ్వకుండా ఓ రకంగా దోబూచులాట ఆడుతున్నారు. ఫెస్టివల్స్‌ని కలిసే సెలబ్రేట్ చేసుకోవడం, వెకేషన్స్‌కి కలిసే వెళ్లడం, ఇద్దరిలో ఎవరి బర్త్ డే అయినా కూడా ఏదో ఒక చోటుకు వెకేషన్‌కి వెళ్లి అక్కడే కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. తమ ప్రేమ గురించి క్లూ ఇస్తుంటారే తప్ప అఫీషియల్‌గా మాత్రం ప్రకటించరు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్‌లో పలు సినిమాలు టాలీవుడ్‌లో రూపొందాయి. అవి ఎంత పెద్ద హిట్ సాధించాయో మనందరికీ తెలిసిందే. గీత గోవిందం సినిమాతో ఈ జంట మొదటిసారి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వారికి మంచి పేరు వచ్చింది. ఇక అప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి పనిచేసింది లేదు.

