విజయ్‌ ఆంటోని 25వ సినిమా ‘భద్రకాళి’

విజయ్‌ ఆంటోని 25వ సినిమా ‘భద్రకాళి’

స్వీయ నిర్మాణంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న 25వ సినిమా ‘భద్రకాళి’. అరుణ్‌ప్రభు దర్శకుడు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ‘పిల్లి కూడా ఓ రోజు పులి అవుతుంది. అబద్ధం, అహంకారం అంతం అవుతుంది’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. గ్యాంగ్‌స్టర్‌, ఫ్యామిలీ నేపథ్య సన్నివేశాలతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. విజయ్‌ ఆంటోని పాత్ర సస్పెన్స్‌గా అనిపించింది. ఆయన స్టైలిష్‌గా కనిపించారు. 190 కోట్ల కుంభకోణం చుట్టూ నడిచే కథ ఇదని, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని, విజయ్‌ ఆంటోని పాత్ర డిఫరెంట్‌ షేడ్స్‌తో సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. వాగై చంద్రశేఖర్‌, సునీల్‌ కృపలానీ, సెల్‌ మురుగన్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: విజయ్‌ ఆంటోని.

editor

Related Articles