వచ్చే సీజన్‌లోనూ కేబీసీ హోస్ట్ అమితాబ్..

వచ్చే సీజన్‌లోనూ కేబీసీ హోస్ట్ అమితాబ్..

కౌన్ బ‌నేగా క‌రోడ్‌పతి ఈ షో ఆధారంగానే ప‌లు భాష‌ల‌లో ఇలాంటి షోలు రూపొంది మంచి స‌క్సెస్ అయ్యాయి. అయితే హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వస్తోన్న ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి ఎంతోమందికి మంచి వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించింది. హోస్ట్ సీట్‌లో అమితాబ్ బ‌చ్చన్ త‌ప్ప మ‌రో సెల‌బ్రిటీని ఎవ‌రూ కూడా పెద్దగా ఊహించుకోలేక‌పోయారు. ఇటీవలే 16వ సీజన్ పూర్తికాగా.. ఈ షో హోస్ట్ నుండి అమితాబ్ తప్పుకుంటారనే వార్తలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. బిగ్ బి ఈ షోను వీడుతున్నట్లు వార్త‌లు రావ‌డంతో అభిమానుల గుండె పగిలినంత ప‌నైంది. అయితే ఒకవేళ అమితాబ్ బచ్చన్ ‘KBC’ నుంచి వెళ్ళిపోతే ఆయన స్థానంలో షారూఖ్ ఖాన్ లేదా ఐశ్వ‌ర్య‌రాయ్ హోస్ట్‌గా వ‌స్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. గ‌త కొద్ది రోజులుగా ఇలా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో బిగ్ బీ క్లారిటీ ఇచ్చేశారు. 16వ సీజన్ చివరి ఎపిసోడ్‌లో మాట్లాడిన ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ అన్ని రూమ‌ర్స్‌కి చెక్ పెట్టారు. గత 16 సీజన్లలో కౌన్ బనేగా కరోడ్‌పతి విశేష ఆదరణ పొందింది. నేను హోస్ట్‌గా వ్యవహరించిన ప్రతిసారీ ఆడియన్స్ నుండి నాకు ఎంతో ప్రేమ మద్దతు లభించింది. గత 25 ఏళ్లుగా నన్ను మీ ప్రేమ, మద్దతు నిలబెట్టింది. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నిజంగా విజయవంతమైందని నేను న‌మ్ముతున్నాను. ఇక లేడిస్ అండ్ జెంటిల్మెన్ వ‌చ్చే సీజ‌న్‌లో మ‌ళ్లీ మిమ్మ‌ల్ని క‌లుస్తాను.

editor

Related Articles