ఈ మధ్య సినీ ప్రముఖులు షూటింగ్స్‌లో ఎక్కువగా గాయపడ్డారన్న వార్తలు వింటూ వస్తున్నాం. రిస్కీ స్టంట్స్ చేస్తూ లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా ఓ హీరోయిన్‌కి యాక్సిడెంట్ అవగా, ఆమెని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె నుదుటిపై 13 కుట్లు వేసి చికిత్స చేశారు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు భాగ్యశ్రీ. సల్మాన్ ఖాన్‌తో కలిసి మైనే ప్యార్ కియా అంటూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించన ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. వ్యాపారవేత్త హిమాలయ్ దస్సానిని పెళ్లి చేసుకుని సినిమాలకు శాశ్వతంగా దూరమైంది. భాగ్రశ్రీ సినిమా షూటింగ్‌లో కాకుండా గేమ్ ఆడుతూ గాయపడడం చర్చనీయాంశం అయింది. భాగ్యశ్రీ పికిల్ బాల్ ఆడుతుండగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 13 కుట్లు పడగా, ఫొటోలలో చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

- March 14, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor