న‌వ్వులు పూయించేలా ‘మ్యాడ్ స్క్వేర్’

న‌వ్వులు పూయించేలా ‘మ్యాడ్ స్క్వేర్’

టాలీవుడ్ నిర్మాణ సంస్థ నుండి వ‌స్తున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్. సూప‌ర్ హిట్ సినిమా మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తోంది. మొద‌టి పార్ట్‌లో న‌టించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంతమంది న‌టులు ఈ సినిమాలో కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి నిర్మాతలు తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌ యూనిట్. ఫ‌స్ట్ పార్ట్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో రాగా.. సీక్వెల్ ల‌డ్డుగాని పెళ్లి (విష్ణు ఓయ్‌) స్టోరీతో ఈ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. లడ్డుగాని పెళ్లికి వ‌చ్చిన మ్యాడ్‌ గ్యాంగ్ బ్యాచిల‌ర్ పార్టీ అని గోవాకి వెళ‌తారు. ఇక మ్యాడ్ సినిమాలో కామెడీతో అల‌రించిన చిత్ర‌బృందం ఇందులో కూడా అలాగే న‌వ్వించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

editor

Related Articles