‘దబిడి దిబిడి’ స్టెప్పులపై నెగెటివ్ కామెంట్స్‌.. షాక్ అయిన ఊర్వశి..

‘దబిడి దిబిడి’ స్టెప్పులపై నెగెటివ్ కామెంట్స్‌.. షాక్ అయిన ఊర్వశి..

హీరో బాలకృష్ణ నటించిన రీసెంట్ సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలాపై ‘దబిడి దిబిడి’ అనే మాస్ సాంగ్ ఉంది. అయితే, ఈ సాంగ్‌లోని స్టెప్స్‌పై ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. బాలయ్య, ఊర్వశితో వేసిన ఈ స్టెప్పులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్‌పై ఊర్వశి రౌటేలా తాజాగా రియాక్ట్ అయ్యింది. ఈ పాటలో తనకేమి అభ్యంతరకరమైన స్టెప్స్ ఉన్నట్లు అనిపించలేదని.. తాను ఈ పాటను ముందుగా రిహార్సల్ చేశానని.. శేఖర్ మాస్టర్‌తో తాను ఇంతకు ముందు కూడా వర్క్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది.

editor

Related Articles