కన్నప్ప సినిమాలో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోకుండానే యాక్టింగ్ చేసినట్లు వెల్లడించాడు నటుడు మంచు విష్ణు. హీరో ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న తాజా సినిమా కన్నప్ప. మంచు కుటుంబం నుండి వస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఇప్పటికే వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా కనిపించబోతున్నాడు. ఒక సినిమా ఇంటర్వ్యూలో భాగంగా విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఈ సినిమాలో యాక్టింగ్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా ఈ సినిమా కోసం ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపాడు.

- February 13, 2025
0
33
Less than a minute
Tags:
You can share this post!
editor