వరుస సినిమాలతో మనల్ని అలరించడానికి వచ్చేస్తోంది అందాల నటి త్రిష. ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలకానున్న చిత్రం విడముయార్చిలో అజిత్‌తో 5వ సారి జతకట్టి మన ముందుకు వస్తున్నారు. ఆమె డెడికెషన్ చూసి “గుడ్ బ్యాడ్ అగ్లీ”లో మరోసారి తన హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు హీరో అజిత్. హే జూడ్‌తో మలయాళ సినిమాల్లోకి అరంగేట్రం చేసిన త్రిష , రెండో చిత్రం టోవినో థామస్ “ఐడెంటిటీ”లో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా జనవరిలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా త్రిష ఖాతాలో మెగా స్టార్ చిరంజీవితో విశ్వంభర, మోహన్ లాల్‌తో రామ్, సల్మాన్ ఖాన్‌తో “ద బుల్”, మరియు కమల్ హాసన్ “థగ్ లైఫ్” లాంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెత్తానికి తెలుగు, మలయాళం, హిందీ, తమిళ ఇండ్రస్ట్రీల్లో వరుసగా 7 సినిమాలతో తన అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నారు త్రిష.

- November 30, 2024
0
28
Less than a minute
You can share this post!
editor