తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ చెన్నై సుందరి త్రిష. దక్షిణాదిన లీడింగ్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న ఈ బ్యూటీ కాంపౌండ్ నుండి వస్తోన్న మలయాళ సినిమా ఐడెంటిటీ. క్రైం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ టొవినో థామస్ హీరోగా నటించగా.. వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 2న మలయాళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కాగా ఈ సినిమా ఇక తెలుగులో కూడా సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమాని జనవరి 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. నైజాంలోనూ ఈ సినిమాని విడుదల చేస్తోంది. అతని ముఖాన్ని రఫ్‌గా గీద్దాం అని టోవినో థామస్ త్రిషకు చెప్పే డైలాగ్‌తో షురూ అయిన టీజర్‌లో.. త్రిష హంతకుడి గురించి మాట్లాడటం.. అతడిని గెస్ చేయడం.. ఆమె చూసిన క్రైంకు వినయ్‌రాయ్‌కు సంబంధమేంటి..? ఈ క్రైంలో టోవినో థామస్ పాత్రేంటనేది సస్పెన్స్‌లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. ఐడెంటిటీ సినిమాను అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మలయాళంలో కూడా తీయనున్నారు, ఇది త్రిషకు రెండో సినిమా.

- January 17, 2025
0
27
Less than a minute
Tags:
You can share this post!
editor