ఉమ్మడి ఎపి మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. శనివారం ఉదయం అన్న కళ్యాణ్‌రామ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న ఎన్టీఆర్.. తాత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పెద్ద సంఖ్యలో వారి అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చారు. కాగా, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. ఇక, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ మంత్రి లోకేష్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
- January 18, 2025
0
265
Less than a minute
Tags:
You can share this post!
administrator

