సైఫ్ అలీఖాన్‌పై దాడికి స్పందించిన షాహిద్ క‌పూర్

సైఫ్ అలీఖాన్‌పై దాడికి స్పందించిన షాహిద్ క‌పూర్

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ఇదిలావుంటే సైఫ్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులతో పాటు రాజకీయ నాయ‌కులు స్పందిస్తున్నారు. తాజాగా క‌రీనా క‌పూర్ మాజీ ప్రియుడు హీరో షాహిద్ క‌పూర్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా దేవా. ఈ సినిమాకు మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఆండ్రోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. పూజ హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా జ‌న‌వరి 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న షాహిద్‌ని మీడియా సైఫ్ అలీఖాన్ ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించ‌గా.. షాహిద్ మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ విష‌యంలో నాతో పాటు మా టీమ్ కూడా చాలా ఆందోళన చెందుతోంది. ఈ సంఘటనతో మేమందరం చాలా షాక్‌కు గురయ్యాం. సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను అంటూ షాహిద్ చెప్పుకొచ్చాడు. అనంత‌రం త‌షాన్ (2007) సినిమా స‌మయంలో సైఫ్‌తో ప్రేమ‌లో ప‌డింది. 2012లో వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు.

editor

Related Articles