ఈసారి దసరాకు వస్తాయనుకున్న పెద్ద హీరోల సినిమాలు మాత్రం థియేటర్లలోకి రావడం లేదు. కానీ ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశపర్చకుండా విజయ దశమిని ప్రత్యేకంగా జరుపుకునేలా ప్లాన్ చేశారు. ఇంతకీ విషయమేంటంటే దసరా ఫెస్టివల్ కు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు ఈవెంట్స్ తో సందడి చేయనున్నారు.
మూవీ లవర్స్ తో పాటు అభిమానులకు పసందైన వినోదాన్ని అందించేందుకు థియేటర్లలో సందడి చేస్తుంటారు స్టార్ హీరోలు. ఇంతకీ విషయమేంటంటే దసరా ఫెస్టివల్ కు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు ఈవెంట్స్ తో సందడి చేయనున్నారు కనగదుర్గ అమ్మవారు కొలువుదీరిన విజయవాడలోనే.
తాజా కథనాల ప్రకారం చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్, బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2 ఆడియో ఆల్బమ్ లాంచ్ ఈవెంట్స్ తో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విజయవాడ ఉత్సవాల్లో హైలెట్ గా నిలువనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ ఈవెంట్స్ తో తెలుసు కదా టీం మెంబర్స్ అయిన సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి సందడి చేయనున్నట్టు ఇన్ సైడ్ టాక్.
విజయవాడ ఉత్సవాల్లో భాగంగా గొల్లపూడి, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల మ్యూజిక్ కాలేజీల్లో ఈవెంట్స్ ప్లాన్ చేయగా.. మ్యూజికల్ నైట్స్ లో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్లు, సింగర్లు శంకర్ మహదేవన్, ఆర్‌పీ పట్నాయక్, సునీత, గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్ సందడి చేయనున్నారని సమాచారం. అంతేకాదు కృష్ణానది తీరాన ది మిస్ విజయవాడ బ్యూటీ పీజియాంట్, మారథాన్ రేస్, బోటు రేసు ఫెస్టివల్ కే హైలెట్ గా నిలువనున్నాయి. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 దాకా జరిగే ఈ ఈవెంట్స్ కు విజయవాడ వేదిక కానుంది. ఇంకేంటి మరి మీ అభిమాన హీరోలను డైరెక్టుగా చూసేందుకు విజయవాడతోపాటు పరిసర ప్రాంతాల వాసులు సిద్ధంగా ఉండండి.
