సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్‌లో సినీ పరిశ్రమలో నెలకొన్న ధోరణిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ పరిశ్రమ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ప్రస్తుతం టాలీవుడ్‌లో కొనసాగుతున్న కమర్షియల్ ట్రెండ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ సాగుతోంది.

“చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్లందరం ఒక పెద్ద వ్యాధితో బాధపడుతున్నాం. మనకు నిజంగా నచ్చిన, మనం నమ్మిన కథలను చెప్పడం మానేశాం. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో ముందే ఊహించుకుని అలాంటి కథలనే తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇదే ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద రోగం” అని వర్మ పేర్కొన్నారు.

నేటి దర్శకులు, రచయితలు క్రియేటివ్ స్వేచ్ఛను పక్కనపెట్టి బాక్సాఫీస్ కలెక్షన్లు, మార్కెట్ లెక్కలు, రొటీన్ ఫార్ములాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో సినిమాల్లో ఒరిజినాలిటీ తగ్గిపోతోందన్నారు.

ప్రేక్షకుల అభిరుచిని ముందుగానే అంచనా వేసి, కథకు అవసరం లేకపోయినా ఫైట్లు, పాటలు, ప్రేమకథలు వంటి కమర్షియల్ అంశాలను జోడించడం వల్ల సినిమా అసలు ఆత్మ దెబ్బతింటోందని వర్మ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

Related Articles