సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు..

సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు..

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌కు హత్య బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. బుధవారం రాత్రి షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి సల్మాన్‌ బాడీగార్డ్‌తో  లారెన్స్‌ బిష్ణోయ్‌  పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణితో మాట్లాడినట్లు గురువారం పోలీసులు తెలిపారు. సల్మాన్‌ఖాన్‌ బుధవారం రాత్రి శివాజీ పార్క్‌ ప్రాంతంలో షూటింగ్‌ స్పాట్‌లో ఉండగా.. ఓ వ్యక్తి సెట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ పేరును ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అప్రమత్తమైన షూటింగ్‌లో ఉన్న సిబ్బంది సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం శివాజీ పార్క్‌ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

editor

Related Articles