ఇటీవలి కాలంలో అభిమానం హద్దులు దాటుతోంది. తమ హీరో కోసం అభిమానులు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక సినిమాల రిలీజ్ సమయంలో అయితే పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి అందరి దృష్టిలో పడేలా చేస్తారు. హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న ఈ సినిమాతో అభిమానుల్ని పలకరించబోతోన్నాడు. రజినీ అభిమానుల్ని మెప్పించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేయగా, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఇష్టపడే వారందరికీ ఈ సినిమా తప్పక నచ్చుతుంది. అర్జున్ దాస్, సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే సినిమాలోని అజిత్ కటౌట్ 285 అడుగులు ఏర్పాటు చేశారు. అయితే అది కుప్పకూలింది. కటౌట్ ఏర్పాటు చేయడమే కాదు దానికి కావలసిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే రోడ్డుమీద జనం ప్రాణాలు పోతాయి, ముందుగా ఆ కటౌట్‌కి చిన్న చిన్న గాలి రంధ్రాలు మధ్యలో ఏర్పాటు చేయాలి, అలా చేసినచో పడిపోయేది కాదు, గాలి వేగానికి ఆ ప్రమాదం జరిగింది, ఆ మాత్రం తెలియకుండా ఎలా కటౌట్‌లు పెడతారు, దీన్ని కూడా అమర్చినవారు పరిశీలించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా 10వ తేదీన విడుదల కానుంది. జి.వి. త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న తదితరులు నటించిన ఈ సినిమాకి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

- April 7, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor