గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ – రష్మికల రిలేషన్ షిప్ గురించి ఎన్నో వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఫెస్టివల్స్‌ని కలిసే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వెకేషన్స్‌కి కలిసే వెళుతున్నారు. ఇద్దరిలో ఎవరి బర్త్ డే అయినా కూడా ఏదో ఒక వెకేషన్‌కి వెళ్లి అక్కడే కలిసి చేసుకుంటున్నారు. అయితే ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే కాగా, ఆమె తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం… ఒమన్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగానే… చాలామంది ‘విజయ్ దేవరకొండ ఎక్కడ?’ అంటూ కామెంట్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో ఇద్దరూ కలిసే ఉన్నారనే చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఇద్దరు విడివిడిగా ఒమన్ వెళ్లినట్టు తెలుస్తోంది. రష్మిక కంటే ఒకరోజు ముందు ముంబై నుండి విజయ్ దేవరకొండ ఒమన్‌కి బయలుదేరాడు. ఆ తర్వాత రోజు రష్మిక వెళ్ళింది. ఇద్దరూ ఒకే చోటుకు వెళ్లారనే సంగతి ఆడియన్స్ అందరికీ అర్ధమవుతోంది. మొదట రష్మిక మందన్నా పంచుకున్న ఫొటోలలో ఆమె సముద్రపు ఒడ్డున బోట్‌లో విందు ఆరగిస్తోంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సముద్ర తీరంలో గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను, నడుస్తున్న ఫోటోలను విడుదల చేశారు. అవి చూశాక ఇద్దరు ఒకేచోట ఉన్నారని నెటిజన్స్ భావిస్తున్నారు.

- April 7, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor