టాలీవుడ్ అగ్ర నిర్మాత నాగవంశీ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం ఎక్స్ వేదికగా అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్‌పై నెట్టింటా ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై కూడా నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే ఫ్యామిలీలో ఉన్న గొడవలతో బాలకృష్ణ, తారక్ దూరంగా ఉంటూ వస్తున్నారు. రీసెంట్‌గా దేవర సినిమా అప్పుడు కూడా బాలకృష్ణ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో బాలకృష్ణ డాకు మాహారాజ్‌ని టార్గెట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.
మూవీకి సంబంధించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు నిర్మాత నాగ వంశీ. ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. ప్రేమతో మీ నాగవంశీ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అయ్యింది.