హీరో రామ్ చరణ్ – ఉపాసన దంపతుల గారలపట్టి క్లీంకార తన తండ్రిని టీవీలో చూసి ఎగ్జైట్ అయ్యింది. ఈ విషయాన్ని ఉపాసన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఆస్కార్ విన్నింగ్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మేకింగ్‌కి సంబంధించి రీసెంట్‌గా డాక్యుమెంటరీ రూపంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్: బిహైండ్ & బియాండ్ అంటూ ఈ డాక్యుమెంటరీ రాగా.. ప్రస్తుతం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ డాక్యుమెంటరీని చూస్తున్న ఉపాసన అందులో రామ్‌చరణ్ రావడంతో అక్కడే ఉన్న క్లీంకారను ఎవరని అడుగుతుంది. తొలిసారి నాన్నని టీవీలో చూడడంతో ఎగ్జైట్ అయ్యింది క్లీంకార. గేమ్ చేంజర్ కోసం క్లీంకారతో పాటు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ఉపాసన రాసుకొచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

- January 4, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor