సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘శారీ’. ఆర్జీవి, ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు గిరికృష్ణ తెరకెక్కించారు. ఏప్రిల్ 4న విడుదలకు సిద్ధమౌతోంది. గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాకి కథనందించిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘మన వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకోవడం వల్ల జీవితంలో చాలా ఇబ్బందులొస్తాయనే అంశంతో ఈ సినిమాని నిర్మించాం. ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు’ అన్నారు. తనకిది డ్రీమ్ ప్రాజెక్ట్ అని కథానాయిక ఆరాధ్యదేవి ఆనందం వ్యక్తం చేసింది.

- March 21, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor