‘స్పిరిట్’ సినిమా హీరో ప్ర‌భాస్‌కి జోడిగా హీరోయిన్‌ దీపికా..?

‘స్పిరిట్’ సినిమా హీరో ప్ర‌భాస్‌కి జోడిగా హీరోయిన్‌ దీపికా..?

హీరో ప్ర‌భాస్, అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న సినిమా ‘స్పిరిట్‌’. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుండి అప్‌డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది చివ‌రిలో సెట్స్ మీద‌కి వెళ్ల‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై చాలా అనుమానాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ జోడీగా మృణాల్ థాకుర్‌తో పాటు కియార అద్వానీ, త్రిష అనే పేర్లు వినిపించాయి. అయితే ఇవి కాకుండా తాజాగా మ‌రో పేరు వినిపిస్తోంది. తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం దీపికా పదుకొణె ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా నటించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

editor

Related Articles