బాలీవుడ్‌లో ఫ్రాంచైజీ ట్రెండ్ మొదలైంది ‘మున్నాభాయ్’ సినిమా నుండే. సంజయ్‌దత్ హీరోగా రూపొందిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’ చిత్రాలు అఖండ విజయాలను సాధించాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ‘మున్నాభాయ్’ కథ రీమేక్ అయి, విజయాలను అందుకుంది. ఇప్పటికీ ఈ ఫ్రాంచైజీకి అభిమానులు ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘మున్నాభాయ్-3’కి సన్నాహాలు చేస్తున్నారు డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ. ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోలు రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్‌లో చేయడానికి క్యూలు కడుతున్నారు. ఇక సంజయ్‌దత్ విషయానికొస్తే.. ఆయన దాదాపు హీరోగా ఈ మధ్య సినిమాల్లో కనపడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హిరానీ ‘మున్నాభాయ్ 3’ని ప్రకటించడం విశేషం. గత రెండు పార్ట్‌ల కంటే మెరుగ్గా హిట్ కొట్టాలనే ధ్యేయంతో ఈ సినిమా తీయడానికి రాజ్‌కుమార్ హిరానీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

- October 21, 2024
0
95
Less than a minute
Tags:
You can share this post!
administrator